రూ. 17 కోట్ల విలువైన స్థలం కేటాయింపు దారుణం

నెల్లూరుః నెల్లూరు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో దాదాపు రూ. 17 కోట్లు విలువచేసే 429 అంకణాల రిజర్వు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కార్పొరేషన్‌ కౌన్సిల్‌లో ఆమెదం కోసం పెట్టడం దారుణమని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. గతంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఇదే అంశాన్ని చేరిస్తే స్థానిక కార్పొరేటర్‌ వ్యతిరేకించడంతో నిలిపివేశారని..కానీ, ప్రస్తుత సమావేశంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి రిజర్వు స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నగరంలోని 7వ డివిజన్‌ లక్ష్మీపురం ప్రాంతంలో జరిగిన విలేకరుల సమావేవంలో  ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడారు.  రిజర్వు స్థలం ఎక్కడుందో విచారణ జరిపించి డీమార్కు చేయకుండా రూ. 17 కోట్ల విలువైన స్థలాన్ని దోచిపెట్టేందుకు ప్రయత్నించడంపై ఆయన మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ చేస్తున్న అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రూ. 17 కోట్లలో సగం మేయర్‌కు, సగం స్థానిక కార్పొరేటర్‌కు ముట్టిందని ప్రజలే అనుకుంటున్నారని పేర్కొన్నారు. 



తాజా వీడియోలు

Back to Top