మంత్రి కామినేని మీద విమర్శలు

హైదరాబాద్) మాజీమంత్రి
ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటూ వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని
శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజులకు
పైగా నిరాహార దీక్ష లో ఉన్న నాయకుడిపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు
పలుకుతున్నారు. ఇది కాపు సామాజిక వర్గాన్ని తూలనాడటం కింద జనం భావిస్తున్నారు. ప్రజల్లో
అనుమానాలు కలిగేలా మట్లాడటం తగని పని అని అంటున్నారు. గతంలో కూడా మంత్రి కామినేని
ఇలాగే దీక్షలు చేసే నాయకుల మీద అనుమానాలు కలిగేట్లు  వ్యాఖ్యలు చేయటం గమనార్హం.  

Back to Top