ఆళ్ల‌గ‌డ్డ హ‌రిస‌ర్వోత్త‌మ‌రావు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

పశ్చిమ గోదావరి: తెలుగుదేశం పార్టీ అరాచక పాలనకు విసిగిపోయిన సొంత పార్టీ నేతలు ప్రతిపక్షంలోకి వలసలు కడుతున్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీల నేతలు సైతం ఆకర్షితులవుతున్నారు. కర్నూలు జిల్లా పాముల‌పాడు మండ‌లానికి చెందిన సింగిల్ విండో మాజీ చైర్మ‌న్ ఆళ్లగడ్డ హ‌రిస‌ర్వోత్త‌మ‌రావు, ప‌లురువు టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వైయస్‌ జగన్‌ పాదయాత్ర క్యాంపు వద్ద  క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు కలిశారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
Back to Top