బాబు అవినీతిని ఎండగడుతూనే ఉంటాం

హైదరాబాద్‌: చంద్రబాబు అవినీతి, అక్రమాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎండగడుతూనే ఉంటుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ నిర్మాణంపై ఇచ్చిన తీర్పుపై ఆర్కే మాట్లాడుతూ.. కృష్ణానదిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని 2014లో కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. అప్పట్లో తాడేపల్లి తహసీల్దార్‌ కృష్ణానది వద్ద ఉన్న భవనాలు అక్రమ నిర్మాణాలని నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా 1884లో రివర్‌ కంజర్వేషన్‌ యాక్ట్‌ ప్రకారం కరకట్ట లోపల మొక్కలు నాటడానికే అనుమతి లేదని బ్రిటీషర్స్‌ యాక్ట్‌ తీసుకొచ్చారని గుర్తు చేశారు. గౌరవ న్యాయస్థానం వాంగ్మూలాలను పరిశీలించి కృష్ణానది కంజర్వేటర్‌లను ఎమ్మెల్యే ఆర్కే రిప్రజెంటేషన్స్‌ని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పిందన్నారు. రివర్‌ కంజర్వేటర్‌ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తిరిగి కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. దీంతో కోర్టు అక్రమ కట్టడాలు కట్టిన వారందరికీ చంద్రబాబుతో సహా మొత్తం 57 మందికి నోటీసులు జారీ చేసిందన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుకు చట్టాలు, న్యాయస్థానాలు అన్నా గౌరవం లేదు కాబట్టి  మ్యానేజ్‌ చేసుకుంటాడేమోనని ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా అక్రమ నిర్మాణాల నుంచి వైదొలిగే వరకు ఊరుకోబోమన్నారు. లింగమనేనిని బెదిరించి భవనం లాక్కున్న చంద్రబాబు జగ్గీ వాసుదేవరావు బాబు అనే కొత్త బాబాకు 4 వందల ఎకరాలను కట్టబెట్టారన్నారు. నదులు ఇష్టానుసారంగా దోచుకుంటూ ఇద్దరూ కలిసి సేవ్‌ రివర్స్‌ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపడం విడ్డూరంగా ఉందన్నారు.
Back to Top