ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్కే ప్రత్యేక పూజలు

మంగళగిరి: పట్టణంలోని పెద్దకోనేరు వద్ద కొలువై వున్న పంచముఖి ఆంజనేయస్వామి   దేవస్థానం ధ్వజస్తంభ ప్రతిష్టంబన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు స్వామి వారి ధ్వజస్థంబ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలు యజ్ఞాలు, హోమాలు చేస్తున్న నిర్వాహకులు చివరరోజు ధ్వజస్థంబ కార్యక్రమాన్ని ప్రత్యేకపూజలతో నిర్వహించారు. ధ్వజస్థంబ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామి వారి ధ్వజస్థంబన కార్యక్రమాని నవధాన్యాలు సమరించి దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించడంతో పాటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) హాజరై ధ్వజస్థంబప్రతిష్టకు నవధాన్యాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ భక్త బృందం కమిటి సభ్యులు ఎమ్మెల్యే ఆర్కేకు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి వెంకటనాగమోహనరావు, పట్టణ, మండల కన్వీనర్లు మునగాల మల్లేశ్వరరావు, మ్రరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top