విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..

అమరావతి: ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో చంద్రబాబు రైతుల భూములు లాక్కొని రియలెస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజధానికి 33 వేల ఎకరాలు సేకరించిన సీఎం చంద్రబాబు వాటిని విదేశీ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూడు పంటలు పండే భూములను విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం కూడా కేంద్రమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
 
Back to Top