గొంతెండుతోన్నా పట్టదా..!

మంగళగిరి: ప్రభుత్వం అసమర్ధత కారణంగానే గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా
మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో వేసవికి ముందే నీళ్ల ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు. కృష్ణా
నదిలో నీటి నిల్వలు త గ్గుముఖం పట్టటంతో సమస్య తీవ్రతరమైందని చెప్పారు. ప్రభుత్వం
ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని తెలిపారు.
వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కార మార్గాలు వెదికి, ప్రజల ఇక్కట్లు తీర్చాలని కోరారు. ఒక వైపు
నుంచి నీటి నిల్వలు తగ్గుతున్నాయని ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నా ప్రభుత్వానికి
ఎందుకు పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. 

Back to Top