పచ్చనేతల పైశాచికత్వం..!

గుంటూరుః భూములివ్వని రైతులను బెదిరించేందుకే చంద్రబాబు, మంత్రులు పంటపొలాలు తగలబెట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. కోతకు వచ్చిన ఐదెకరాల చెరకు పంటను బూడిదపాలు చేశారని ప్రభుత్వంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. గతంలోనూ వ్యవసాయ పరికరాలు, షెడ్లు తగలబడితే ప్రభుత్వం ఇంతవరకు వారిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదన్నారు. ఇది ముమ్మాటికీ పచ్చసర్కార్ చేసిన దుర్మార్గమైన పనేనని ఆళ్ల స్పష్టం చేశారు. 

బెదిరింపులకు భయపడని రైతులను టార్గెట్ చేస్తూ పచ్చనేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆళ్ల మండిపడ్డారు.  పంట తగలబెడితే భయపడి ఇస్తారనే ఇలా చేస్తున్నారన్నారు.  భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచేందుకే వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని...రైతుల తరుపున న్యాయపోరాటం చేస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు.
Back to Top