'రాబోయే రోజుల్లో రైతుల విషయంలో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి విమర్శించారు. నగరంలో శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల విషయంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే ఆర్కే హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రాజధాని ప్రాంత రైతుల భూమి దోపిడీ చేసేందుకు ఏపీ సీఎం సిద్ధపడ్డారంటూ ఆయన ఆరోపించారు. రైతు వ్యతిరేకుంలందర్నీ కోర్టు మెట్లు ఎక్కించి తీరుతామని చెప్పారు.
Back to Top