'రాక్షస స్వభావాలు, గుణాలు ఆయనకే సొంతం'

హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలను రాక్షసులతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాక్షస స్వభావాలు, రాక్షస గుణాలు చంద్రబాబు నాయుడుకే సొంతం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమీలేక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఇతరుల గురించి బాబు అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
Back to Top