ర‌మ‌ణ‌మృతి పార్టీకి తీర‌ని లోటు: ఎమ్మెల్యే ఆర్కే

మంగ‌ళ‌గిరి (తాడేప‌ల్లి రూర‌ల్‌):  కౌన్సిల‌ర్ ర‌మ‌ణ మృతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోటు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రైవేట్  ఆస్ప‌త్రిలో ర‌మ‌ణ చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే .. ర‌మ‌ణ ఇంటికి చేరుకుని నివాళుల‌ర్పించారు. అత‌ని కుటుంబ స‌భ్యులకు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. కాగా ఇటీవ‌ల మంగళగిరి పట్టణపరిధిలోని 31వ వార్డులో జ‌రిగిన  బై ఎలక్షన్స్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి 153 ఓట్ల‌తో గెలుపొందారు.

తాజా ఫోటోలు

Back to Top