రాష్ట్ర ప్రయోజనాలే వైయస్‌ జగన్‌కు ముఖ్యం

విజయవాడ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పిన వెంటనే వైయస్‌ జగన్‌ స్పందించి ముందుకు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానానికి ముందుకు వచ్చారన్నారు. నిన్న మా అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని మాట చెప్పిన చంద్రబాబు ఇవాళ మాట మార్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేయించిన చంద్రబాబు ఆ పేపర్లు ఢిల్లీకి పంపించలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడి హోదాను విస్మరించారన్నారు. 
 
Back to Top