నేడు వాక్ విత్ జ‌గ‌న‌న్న‌- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర నేటికి వెయ్యి కిలోమీట‌ర్లు
- అన్ని మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా కేంద్రాల్లో సంఘీభావ యాత్ర‌లు


నెల్లూరు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. అలుపెరగని సైనికుడిలా అడుగులు వేస్తున్న వైయ‌స్‌ జగన్‌కు సంఘీభావంగా ఊరూరా పాదయాత్ర నిర్వహిం చాలని పార్టీ అధిష్టానం నిర్ణయిం చింది. అందులో భాగంగా సోమవారం జిల్లా నేతలు ‘జగనన్నతో కలిసి నడుద్దాం’ పేరుతో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని జిల్లాలోని  నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో కలిసి నడవనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు. రాజన్న తనయునికి మద్దతుగా గ్రామస్థాయిలోనూ పాదయాత్ర చేసేందుకు గ్రామీణులు ఉత్సాహం చూపుతున్నారు. వాక్ విత్ జ‌గ‌న‌న్న పేరుతో చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి సోష‌ల్ మీడియాలో విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్ప‌టికే దేశ‌, విదేశాల్లో వాక్ విత్ జ‌గ‌న‌న్న అంటూ సంఘీభావ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిర‌ప‌డిన తెలుగు ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

విజ‌య సంక‌ల్ప స్థూపం..
గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం సైదాపురం వాసులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జననేత పాదయాత్ర తమ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటుతుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసేశారు. సైదాపురం గ్రామస్థులు 25 అడుగుల  విజయ సంకల్ప స్థూపం ఏర్పాటు చేశారు. దీనిని వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించనున్నారు. జన నేతకు ఆహ్వానం పలుకుతూ గ్రామం నిండా ఫ్లైక్సీలు, రంగు రంగుల ముగ్గులు, పూల స్వాగతాలను ఏర్పాటు చేశారు.
Back to Top