వైఎస్ జగన్‌ రైతు దీక్షకు సర్వం..సిద్ధం


ఏలూరు:  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1న తణుకులో చేపట్టనున్న రైతు దీక్ష కోసం పార్టీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. దీక్షను విజయవంతం చేసేందుకు వివిధ హోదాల్లోని నాయకులంతా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని  దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేశారు. హామీల పరంపరతో అధికారంలోకి వచ్చి..ఆనక ైరె తులను, డ్వాక్రా మహిళలను, అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురిచేస్తున్న చంద్రబాబు తీరు, సర్కారు విధానాలపై సమరశంఖం పూరించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రైతుదీక్షకు శ్రీకారం చుడుతున్నారనే విషయాన్ని చాటుతున్నారు. పార్టీ జిల్లా సారథి పిలుపు మేరకు రైతు దీక్షను విజయవంతం చేయడానికి కార్యకర్తలు ఇప్పటికే చొరవ తీసుకోగా, గురువారం జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

నాయకులాంతా ఒక్కటై..
రైతు దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లాలోని పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడుస్తూ..ఎవరికి వారు ప్రత్యేక బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘరాం, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాదయ్య తదితరులు దీక్షా స్థలి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.  
Back to Top