‘గర్జన’ ఏర్పాట్లు పూర్తి

నెల్లూరు: ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగరం కేంద్రంగా విశాఖ తరహాలో వంచనపై గర్జన దీక్షకు పూనుకుంది. శనివారం వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వంచనపై గర్జన దీక్ష చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. వీఆర్‌ కళాశాల మైదానంలో జరుగనున్న దీక్షకు రాజీనామా చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. 
Back to Top