మాదిగలంతా వైఎస్సార్సీపీకి ఓటేయాలి

వరంగల్ః మాదిగలంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్దార్థ ఓటర్లకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడుతున్న నల్లా సూర్యప్రకాష్ కు ఓటేసి గెలిపించాలన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశారని, ఇదే దిశలో వైఎస్ జగన్ కృషిచేస్తున్నారని సిద్దార్థ తెలిపారు.     వైఎస్సార్సీపీకి మద్దతుగా ఆయన జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. 

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని, రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి దళితులను అవమానపర్చారని సిద్దార్థ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దొడ్డిదారిన మిషన్ కాకతీయ, హరితహారం, వాటర్ గ్రిడ్ కు మళ్లించి ద్రోహం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానన్న చంద్రబాబు..ఇప్పుడు ఆఊసే ఎత్తడం లేదని ఫైరయ్యారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,టీడీపీ-బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు.  
Back to Top