సెక్స్ రాకెట్ ను ప్రజలంతా గమనిస్తున్నారు

హైదరాబాద్: అధికార తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ  ఎమ్మెల్యేల గొంతునొక్కుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  మాట్లాడుతూ...కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులను శిక్షించాలని ప్రశ్నించినందుకు మహిళా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు.  ఉద్దేశ్యపూర్వకంగానే రోజాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.

ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం లేదని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ రూల్స్ ప్రొసీజర్ చూపించినా కూడా వినకుండా స్పీకర్ సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు రోజా పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆమెకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. కేవలం ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్ ను పట్టుకొని చంద్రబాబు తనపై కూడా అక్రమ కేసులు పెట్టాడని ఈశ్వరి ఫైరయ్యారు.
Back to Top