ఎంపీల దీక్ష‌కు అఖిల‌ప‌క్షం సంఘీభావం

విజ‌య‌వాడ‌: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎంపీ పద‌వుల‌కు రాజీనామా చేసి ఆరు రోజులుగా ఆమ‌ర‌ణ దీక్ష కొన‌సాగిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు అఖిల‌ప‌క్షం సంఘీభావం తెలిపారు. ఇవాళ విజ‌య‌వాడ‌లోని మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో ప‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయించారు. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నవించారు. ఈ నెల‌17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న‌ట్లు చెప్పారు.
20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ ఏర్పాటు చేయాల‌ని, కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపునిచ్చారు. ఈ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి  కె.పార్థసారధి పాల్గొన్నారు.
Back to Top