తక్షణమే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

కాకినాడ : ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.  కాకినాడలో ప్రత్యేక హోదాకై  రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కన్నబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విభజన చట్టంలోని హామీలు ఏ మేరకు అమలు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రత్యేకహోదా కోసం ఈనెల 10న వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాలో భాగంగా...కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో  వైఎస్ జగన్ పాల్గొంటారని కన్నబాబు చెప్పారు.

Back to Top