టీడీపీ భూకబ్జాలపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం

విశాఖపట్నంః టీడీపీ సర్కార్ భూ కబ్జాలపై విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతోంది. అన్ని పార్టీల నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అత్యంత విలువైన భూముల రికార్డులు పోయాయని ప్రభుత్వం చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టు చెబుతోందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. భూ దందాల గురించి తనకు తెలియదని సీఎం మాట్లాడడంపై అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయవిరుద్ధమైన పనులు చేస్తోందని అమర్నాథ్ అన్నారు.

Back to Top