కబ్జాకోరులంతా జైలుకు వెళ్లాల్సిందే

  • టీడీపీ భూ కుంభకోణాలపై అఖిలపక్షం మండిపాటు
  • ముదపాక భూములను పరిశీలించిన నేతలు
  • కబ్జా చేసిన భూములను తిరిగిచ్చేయాలి
  • వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్
  • రైతులు, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని సుస్పష్టం
విశాఖపట్నంః  టీడీపీ  భూకుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలి, సాగుదారులకు భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో ఆల్ పార్టీస్ ఉద్యమబాట పట్టాయి. నేడు అఖిలపక్ష నాయకులతో కలిసి విజయసాయిరెడ్డి ముదపాక భూములను  పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. 500 ఎకరాలు హుడా ల్యాండ్ పూలింగ్ కోసం టీడీపీ నేతలు రైతులను మభ్యపెట్టి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం జరగడం కోసం అఖిలపక్షం మహాధర్నాకు ప్లాన్ చేస్తోంది. 

ఉద్యమం ఆపాలంటూ టీడీపీ నేతలు తనకు వర్తమానం పంపడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. రైతులు, దళితులకు అన్యాయం చేస్తూ... ముదపాకలో మీరు ఏభూములైతే కబ్జా చేశారో అవన్నీ వారికి తిరిగిచ్చేయాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే మంత్రులు, టీడీపీ నేతల భూ కబ్జా సాగుతోందని, వీరంతా జైలుకెళ్లాల్సిందేనని విజయసాయిరెడ్డి అన్నారు.  రైతులు, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. 
Back to Top