వైయస్‌ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి


గుంటూరు:

‘రెండు, మూడు బిల్డింగులు కట్టేసి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశానంటున్నారు‌ చంద్రబాబు. అలా అయితే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డును పూర్తిచేసి హైదరాబాద్‌కు ఐదు టీఎంసీ నీళ్లు ఇచ్చిన రాజశేఖరరెడ్డి ఏమనాలి? చంద్రబాబు హైదరాబాద్‌కు చేసినదాని కంటే వైయస్ చేసింది వంద‌ రెట్లు ఎక్కువ. కాకపోతే రాజశేఖరరెడ్డికి గొప్పలు చెప్పుకోవడం తెలియదు, మీడియాను మేనేజ్‌ చేయడం రాదు. వినేవా‌ళ్ళుంటే వైయస్ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలూ తానే పెట్టానని అబద్ధాలు చెప్పగల సమర్థుడు చంద్రబాబు’ అని శ్రీమతి షర్మిల అన్నారు.

‘అరవై నాలుగు కళల్లో దొంగతనం ఒక కళట. కన్నార్పకుండా ఎన్ని అబద్దాలైనా చెప్పే కళ చంద్రబాబు సొంతం. ఆయనను నమ్మి మోసపోవద్దు’ అన్నారు. గుంటూరు జిల్లాలో ‘వైయస్ఆర్ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రేపల్లె, తెనాలి, సత్తెనపల్లి, బెల్లంకొండ, పిడుగురాళ్ల బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు.

'‌టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు  రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తరిమి కొట్టాలని శ్రీమతి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

Back to Top