నెల్లూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో చేపట్టనున్న రైతు దీక్షకు జిల్లా నాయకులు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఎన్నికల వాగ్దానాలను నేటికీ నెరవేర్చలేదన్నారు. రైతుల రుణ మాఫీ మొదలుకొని డ్వాక్రా మహిళల రుణమాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలన్నీ గాలికివదిలేశాడన్నారు. అందుకే ప్రభుత్వ ధోరణిని ఎండగడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేయనున్నారని పేర్కొన్నారు. <br/>