అభివృద్ధికి అంద‌రూ క‌లిసిరావాలి

నెల్లూరు:  ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో రాజ‌కీయాల‌క‌తీతంగా అంద‌రూ క‌లిసిరావాల‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి అన్నారు. మాద‌రాజుగూడూరులో ప్ర‌జాబాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎన్‌సీసీ సంస్థ సీఎస్సార్ నిధుల‌తో నిర్మించిన రెండు వాట‌ర్ ప్లాంట్ల‌ను ఆయ‌న ప్రారంభించారు. అభివృద్ధి కోసం అంద‌రితో క‌లిసి ప‌ని చేసేందుకు తాను సిద్ధ‌మ‌న్నారు. ఎమ్మెల్యే గ్రాంట్ లేక‌పోయినా నియోజ‌కవ‌ర్గ అభివృద్ధి కోపం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్త‌ున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ చేప‌ట్టిన రెండు రోజుల నిర‌స‌న దీక్ష‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి సంఘీభావం ప్ర‌క‌టించారు. మంత్రి నారాయ‌ణ సొంతూరు నెల్లూరు కార్పొరేష‌న్‌లో అభివృద్ధి స‌క్ర‌మంగా సాగ‌డం లేద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో స‌బ్‌ప్లాన్ ప‌నులు పూర్త‌వుతుంటే, నెల్లూరులో ఇంకా టెండ‌ర్ల‌ను కూడా పిల‌వ‌లేద‌ని, అయినా మేయ‌ర్ అజీజ్, మంత్రి ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అభివృద్ధి విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

Back to Top