గోపాల్ రెడ్డి విజయానికి అందరూ సహకరించాలి

ఉరవకొండ:పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పట్టభద్రులను కోరారు. సోమవారం స్థానిక జడ్‌పీ బాలికల, సెంట్రల్, ఎస్‌కె ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ప్రవేట్‌ స్కూల్స్‌లో విస్త్రుతంగా ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ మండల, పట్టణ కన్వీనర్‌లు నరసింహులు, తిమ్మప్పలు మాట్లాడుతూ ఎంతో అనుభవశాలి అయిన గోపాల్‌రెడ్డిను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరిద్యోగుల తరుపున తన గళాన్ని విన్పిస్తాడని తెలిపారు. దీంతో పాటు చంద్రబాబు ఎన్నికల సమయంలో నిరిద్యోగులకు ఇచ్చిన హమీలను నెరవేర్చే వరుకు పోరాడుతారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో జడ్‌పీటీసీ తిప్పయ్య, ఎస్‌సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, చేనేత విభాగం నాయకులు చెంగలమహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


 
 
Back to Top