మహానాడు నిండా అబద్దాలు-మాజీ మంత్రి ధర్మాన

హైదరాబాద్) మహానాడు నిండా అబద్దాలు సాగుతున్నాయని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద్ రావు అభివర్ణించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ గొప్ప వ్య‌క్తి మాత్ర‌మే కాద‌ని గొప్ప నిబద్ధ‌త‌, నిశ్చిత‌త క‌లిగిన వ్య‌క్తి అని అంద‌రికీ తెలుస‌ని ఆయన అన్నారు.  రాజ‌కీయ పార్టీని స్థాపించిన అన‌తి కాలంలోనే దానిని అధికారంలోకి తీసుకొచ్చిన ఘ‌న‌త ఉంద‌న్నారు. రెండుసార్లు పార్టీని గెలిపించి ప్ర‌జ‌ల్లో ముద్ర వేసుకున్నార‌ని ద‌ర్మాన పేర్కొన్నారు. కానీ, ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన్ని విమర్శించిన చంద్రబాబే నేడు  ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.   అస‌లు ఎన్టీఆర్ ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌విస్తారా అని ప్రశ్నించిన చంద్రబాబే..  నేడు ఎన్టీఆర్‌ను గొప్ప‌వ్య‌క్తి అని పొగుడుతున్నారు అని ధర్మాన విమర్శించారు. 
Back to Top