అవన్నీ అభూత కల్పనలే

పార్టీ మారే ప్రసక్తే లేదు
తామంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులం
వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నాం

పార్టీ మారుతున్నారంటూ తమపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసురెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి వైఎస్సార్సీపీలోనే ఉన్నానని, మంత్రి పదవిని సైతం వదిలి వచ్చానని చెప్పారు. తామంతా వైఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానులమని స్పష్టం చేశారు.  పార్టీ మారే ప్రసక్తే లేదని, తమపై వస్తున్న వార్తలన్నీ అభూత కల్పనలేనని కొట్టిపారేశారు.  

వైఎస్ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని బాలినేని తేల్చిచెప్పారు. చిన్న చిన్న సమస్యలున్నా, అధ్యక్షులు వైఎస్ జగన్ అంతా సర్దుబాటు చేస్తారని చెప్పారు. అంత మాత్రం దానికే ఎవరూ పార్టీ వీడే పరిస్థితి ఉండదన్నారు. వ్యక్తిగత కారణాలతోనే కొద్దికాలం దూరంగా ఉన్నాను తప్ప అంతుకుమించి మరేమీ లేదన్నారు. 

తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలిపారు. తామంతా వైఎస్ జగన్, శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదని ఆయన అన్నారు. 

Back to Top