ఇదేనా దశలవారిగా మద్యం నిషేధించడం

విజయవాడ: బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో మంచినీళ్లు అమ్మినట్లుగా మద్యాన్ని విక్రయించడానికి ప్రభుత్వం రెడీ టూ లిక్కర్‌ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో మద్యాన్ని నిషేదిస్తాం. మద్యానికి అలవాటు పడినవారికి డీఎడిక్షన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుందని చెవిరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. 2004–05 సంవత్సరంలో మద్యం ఆదాయం రూ. 4497 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ. 12 వేల కోట్ల ఆదాయానికి చంద్రబాబు సర్కార్‌  తీసుకెళ్లిందని స్పష్టం చేశారు. ఇదేనా దశలవారిగా మద్యం నిషేదించడం అని ప్రశ్నించారు. ఎమ్మార్పీ రేట్ల కంఏట ఎక్కవ రేట్లకు అమ్మడం వల్ల సంవత్సరానికి రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఎమ్మెల్సీ సోము వీ్రరాజు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 4380 మద్యం దుకాణాలు ఉంటే 40 వేల బెల్ట్‌షాపులు ఉన్నాయని చెప్పారు. బెల్ట్‌షాపులతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనే వాడవాడన బెల్ట్‌సాపులు ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

Back to Top