అక్రమ నిర్బంధానికి నిరసనగా 27న ప్రదర్శన

హైదరాబాద్, 25 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏడాదిగా జైలులో అక్రమంగా  నిర్భంధించిన తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి సోమవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని పీపుల్సు  ప్లాజాలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీకి తరలి రావాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి పిలుపునిచ్చారు. మే 27 తేది సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన కార్యక్రమంలో  దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్ రెడ్డి  అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు తరలిరావాలని  అభిమానులను శ్రీమతి భారతి కోరారు.

Back to Top