సీఎం పదవి అభాసుపాలు

రాజంపేటఃరాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చంద్రబాబునాయుడు పుణ్యమా అభాసుపాలైందని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి విమర్శించారు. శుక్రవారం తన స్వగృహంలోఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల నంద్యాలలో బాబు తన పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం దించుకొనేలా ఉన్నాయన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను బెదిరించే ధోరణిలో అవలంభించిన తీరు ఆయన రాజకీయ దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు. రోడ్లు వేసానని, ఫించన్లు ఇప్పించానని చెపుతూ ఓట్లు తనకే వేయాలని,  డబ్బుల పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తామని ఇలా మాట్లాడటం చూస్తుంటే ఇప్పటి నుంచి ఓటమిభయం పట్టుకుందన్నారు. వయోభారంతో అదుపుతప్పిసీఎం మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తించారన్నారు. ఈ మూడేళ్లలో సీఎంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి సంబంధించి చేసే అభివృద్ధి తన సొంత నిధులతో చేసినట్లుగా తనను, తన పార్టీని గెలిపించాలని కోరుకోవడం చూస్తుంటే అపహాస్యంగా ఉందని ఎద్దేవా చేశారు. తనకు ఓట్లు వేయకుంటే ఆ గ్రామాలను అభివృద్ధి చేయనని చెప్పడం చూస్తుంటే ప్రజలకోసం పనిచేసినట్లుగా లేదని, తన రాజకీయస్వలాభం కోసం అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోందని, ఆ ప్రభుత్వం మళ్లీ నిధులతో ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి వెచ్చించడం జరుగుతున్న ప్రక్రియ అన్నారు. అంతేగాని సీఎం చంద్రబాబునాయుడు తాను సంపాదించినడబ్బుతో అభివృద్ధి చేసినట్లుగా ఆయన వ్యవహారం కనిపిస్తోందన్నారు. రానున్న సార్వత్రక ఎన్నికలలో ఓటమి భయం చంద్రబాబునాయుడుకు ఇప్పటి నుంచే పట్టుకుందని ఎద్దేవా చేశారు. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిలేదని, కేవలం భూ కబ్జాలు, ఇసుక, మట్టి దోపిడి, అడ్డగోలుగా పాలన, అమరావతి పేరుతో భూమలు లాక్కోవడం ఇలా ఒకటేంటి ప్రతి అంశంలోనూ లాభాపేక్షతో అమలుచేసినవే కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజలను తన పాలనలో నట్టేటా ముంచేస్తున్నారని, ఇంకా రెండేళ్లు మరింతగా ముంచేస్తారన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుపాలనకు ఎప్పుడెప్పుడు చరమగీతం పాడుదామని ఎదురుచూస్తున్నారని, ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తమ మదిలో ఉన్న కసిని చూపించాలని వేయుకన్నులతో కాలం నెట్టుకొస్తున్నారని ఆకేపాటి వెల్లడించారు.

తాజా వీడియోలు

Back to Top