ఎయిర్ పోర్టు బాధితుల‌కు అండ‌దండ‌లు..!

విజ‌య‌న‌గ‌రం) భోగాపురం ఎయిర్
పోర్టు నిర్మాణం బాధితులు అంత‌కంత‌కూ
పెరుగుతున్నారు. బాధిత గ్రామాల రైతుల్ని
టీడీపీ నేత‌లు, అదికారులు
అడ్డ‌గోలుగా బెదిరిస్తున్నారు. దీంతో వారి త‌ర‌పున వైఎస్సార్‌సీపీ నేత‌లు
అండ‌గా నిలుస్తున్నారు. సంబంధిత
గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సీజీసీ స‌భ్యులు పెన్మ‌త్స సాంబ‌శివ‌రాజు, జిల్లా
అద్య‌క్షులు కోల‌గ‌ట్ల
వీర‌భ‌ద్ర‌స్వామి
త‌దిత‌రులు ప‌ర్య‌టించారు. రైతుల‌కు పార్టీ అండ‌గా ఉంటుంద‌ని
వివ‌రించారు. గ్రామాల్లో రైతుల మ‌నోభావాల్ని
అడిగి తెలుసుకొన్నారు. భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని మ‌నోస్థైర్యాన్ని
నింపే ప్ర‌య‌త్నం
చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top