పేద‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యం

కందుకూరు అర్బన్‌(ఒంగోలు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద‌ల ప‌క్ష‌మ‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే పార్టీ ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి తూమాటి మాధ‌వ‌రావు అన్నారు. శుక్ర‌వారం స్థానిక మున్సిపాలిటీలోని 1, 3 వార్డులో ఉన్న జ‌నార్ధ‌న‌కాల‌నీ, ఉప్ప చెరువులో  ``వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం మాధ‌వ‌రావు మాట్లాడుతూ ప్ర‌తి ఇంటికీ వెళ్తి న‌వ‌ర‌త్నాల గురించి  వివ‌రిస్తున్నామ‌ని, న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని అన్నారు.  తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు 100 హామీలు ఇచ్చారని, ఆ ప‌థ‌కాలు అందాయా.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామన్నారు ఇచ్చారా లేదా.. ఇల్లు కట్టిస్తామన్నారు అని అడిగారు. ఈ సందర్భంగా పలు కుటింబీకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పధకాలు అందలేదన్నారు. అనంతరం ప్రజల చేత 9121091210 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి వైయ‌స్ఆర్ కుటుంబ‌లో చేర్పించారు. 

తాజా ఫోటోలు

Back to Top