వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం

అద్దంకి: 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ చెంచు గ‌ర‌ట‌య్య కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్యాల‌యంలో బ‌ల్లికుర‌వ మండ‌ల పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌న్నారు. అదే విధంగా నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ‌స్థాయి నుంచి పార్టీ బ‌లోపేతానికి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. స‌మావేశంలో పార్టీ మండ‌ల క‌న్విన‌ర్ చింత‌ల పేర‌య్య‌, యూత్ అధ్య‌క్షుడు సుబ్బారెడ్డి, య‌ర్రం శ్రీ‌నివాస‌రెడ్డి, ప్ర‌సాద్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top