ఐదవ ఛార్జిషీట్‌పై సిబిఐ కోర్టులో జగన్ మెమో

హైదరాబా‌ద్, 10 ఏప్రిల్‌ 2013: సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సిబిఐ ఐదవ ఛార్జిషీట్ దాఖలు చేసిందని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎం‌.పి. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సిబిఐ ఐదవ ఛార్జిషీట్‌పై ఆయన ఈ మెమో దాఖలు చేశారు. ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తిచేసి తుది ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ‌సిబిఐ తెలిపిందని, కానీ ఇప్పుడు ఒకే అంశంపై ఛార్జిషీట్ ‌వేసిందని ఆయన వివరించారు. దీనినే తుది ఛార్జిషీట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని ఆ మెమోలో కోర్టును శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరారు.
Back to Top