వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు

హైదరాబాద్ః అగ్రిగోల్డ్ బాధితులు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ ను కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని జననేతకు విన్నవించుకున్నారు. అండగా ఉంటానని వైఎస్ జగన్ బాధితులకు హామీ ఇచ్చారు. కాగా ఇవాళ అసెంబ్లీలో  ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ అంశంపై చర్చకు పట్టు బట్టిన సంగతి తెలిసిందే.


అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చకు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింద.  అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, సభ వాయిదా పడింది.
Back to Top