వ్యవసాయానికి తూట్లు పొడుస్తూ.. సంబరాలా?

వ్యవసాయానికి తూట్లు పొడుస్తూ.. సంబరాలా?
మీ పాలనలో ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నాడా బాబూ?
బాబు పాలనలోనే వ్యవసాయ వ్యతిరేక పరిస్థితులు
టీడీపీ రుణమాఫీ రైతుకు గుదిబండలా మారింది
ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూకబ్జాలు
అడ్డువచ్చిన వారిని వివస్త్రలను చేస్తూ బెదిరింపులు
రైతుకు చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకొని పాలన చేయాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ




హైదరాబాద్‌: సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా తూట్లు పొడుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ఇంతగా దిగజార్చుతుంటే రైతు ఎలా బతుకుతాడని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ శుక్రవారం  విలేకరుల సమావేశం నిర్వహించారు.  దేశంలోనే తలసరి అప్పు ఉన్న రైతులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని సెస్సా, జైన్‌అలె చెబుతున్నాయన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి చంద్రబాబు హయాంలోనే తప్ప మరే ప్రభుత్వంలో లేదన్నారు. ఏపీలో 62 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారన్నారు. వారు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వారి బాధలను చెప్పుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. వైయస్‌ జగన్‌ ఏ ఊరుకు వెళ్లినా.. ఏ రైతు దగ్గరకు వెళ్లినా మా పంటలకు గిట్టుబాటు ధర లేదని మొరపెట్టుకుంటున్నారన్నారు. రైతు పంటకు మద్దతు ధర కల్పించలేనప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటినీ పట్టించుకోరు.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించరు.. ఇలా  పరిస్థితులు దిగజారుతున్నప్పుడు వాటిని చక్కదిద్దాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉన్నప్పటికీ , ఆ దిశగా ఆలోచించకపోగా.. రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారన్నారు. 

ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఇప్పటి వరకు ఆ రుణాల వడ్డీలకు కూడా చంద్రబాబు డబ్బులు చెల్లించలేదని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రుణమాఫీ రైతులకు గుదిబండగా మారింది. బ్యాంక్‌లు కొత్తగా అప్పులు ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లలో రుణమాఫీ లేదు. రైతులకు చెందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలా, సున్నా వడ్డీలు అటకెక్కాయన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో రైతు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించిందని చెప్పే రైతును ఒక్కరినైనా చూపించగలరా అని చంద్రబాబును నిలదీశారు.
 
ల్యాండ్‌ పూలింగ్, ల్యాండ్‌ ఎక్విజేషన్‌ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతులను బెదిరించి వ్యవసాయ భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్‌ ఎక్విజేషన్‌ కోసం ఏకంగా చట్టాలనే సవరించే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు కేంద్రమే భయపడి వెనక్కు తగ్గితే.. టీడీపీ నిర్భయంగా రాష్ట్రంలో చట్టాన్ని సవరించిందన్నారు. వైజాగ్‌లో దళితుల భూములు లాక్కోవద్దని అడ్డువచ్చిన మహిళను వివస్త్రను చేశారని, అదే విధంగా టీడీపీ కబ్జాల కోసం అడ్డొచ్చిన వారిని రకరకాల యంత్రాలతో తొక్కించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మీ నాయకులు భూములు లాక్కుంటుంటే దళితులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు నోరు మెదపకుండా చూడాలా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

మేనిఫెస్టోలో పెట్టునట్లుగా ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ. 5 లక్షల ఇస్తున్నారా అని చంద్రబాబును వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంచెనాలు పెంచి అడ్డగోలు జీవోలు విడుదల చేసి కమీషన్లు నొక్కేయడం తప్ప రైతుకు మేలు చేసే ఒక్క కార్యక్రమం అయినా చేపట్టారా అని చంద్రబాబును నిలదీశారు. నాలుగేళ్లుగా రైతుకు చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని విరుచుకుపడ్డారు. రైతు దినోత్సవం సందర్భంగానైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. రైతు దినోత్సవం జరిపే ముందు నేను, నా ప్రభుత్వం రైతుకు చేసిన మేలు ఏంటీ అని ఆలోచించుకోవాలన్నారు.
Back to Top