కాసేపట్లో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట సమావేశం

విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కంకణం కట్టుకుంది. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 11 మంది సభ్యులతో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాసట కమిటీ మొట్టమొదటి సమావేశం విజయవాడ పార్టీ కార్యాలయంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, అప్పిరెడ్డి, సుధాకర్‌బాబు అగ్రిగోల్డ్‌ బాధితులతో పలు అంశాలపై చర్చించనున్నారు. 
 
Back to Top