నేడు క‌లెక్ట‌రేట్ ల ఎదుట ఆందోళ‌న‌

హైద‌రాబాద్) ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోరుతూ వైయ‌స్సార్సీపీ ఆధ్వ‌ర్యంలో జిల్లా క‌లెక్ట‌రేట్ ల ఎదుట ఆందోళ‌న జ‌ర‌గ‌నుంది. తూర్పుగోదావ‌రి జిల్లా లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటున్నారు.
విభ‌జ‌న‌తో అన్ని విధాలా న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఒక సంజీవ‌ని అని మొద‌ట నుంచీ ప్ర‌తిప‌క్ష వైయస్సార్సీపీ వాదిస్తోంది. ఇందు కోసం అనేక ద‌శ‌ల్లో ఉద్య‌మం సాగిస్తోంది. డిల్లీలో ధ‌ర్నా చేయ‌టంతో పాటు గుంటూరు వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష నిర్వ‌హించారు. యువ‌భేరి పేరుతో విద్యార్థులు, యువ‌త కు అవ‌గాహ‌న క‌ల్పించారు. తాజాగా అన్ని జిల్లా క‌లెక్ట‌రేట్ ల ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించాల‌ని పార్టీ పిలుపు ఇచ్చింది.
తూర్పు గోదావ‌రి జిల్లా లో జ‌రిగే ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గన్ నేతృత్వం వ‌హించ‌నున్నారు. సీనియ‌ర్ నాయ‌కులు, జిల్లా లోని పార్టీ యంత్రాంగం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ, ఇత‌ర నాయ‌కులు ద‌గ్గ‌ర ఉండి పూర్తి చేశారు. 

ఇదే వార్తాంశం తెలుగులో:  http://bit.ly/1s9rXrV 

Back to Top