టీడీపీ సభ్యత్వ కార్డుపై ఆందోళన

పెదపూడి(కూచిపూడి):  వైయస్సార్‌సీపీ కార్యకర్తనైన తనకు టిడిపి సభ్యత్వ కార్డు ఏవిధంగా వచ్చిందో అర్ధంకావటం లేదని, తాను పొటోలు కాని, ఏవిధమైన ఫీజులు కాని చెల్లించకుండా కార్డు ఇవ్వటంపై మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన వీరంకి వెంకట కృష్ణా రావు ఆంధోళన వ్యక్తం చేశాడు. పెదపూడిలో పార్టీ మండలాధ్యక్షులు రాజులపాటి రాఘవరావు సమక్షంలో జిల్లా ట్రేడ్‌యూనియన్‌ ప్రధాన కార్యదర్శి తాతా శేషుబాబుతో కలిసి బుధవారం విలేకర్ల వద్ద వాపోయాడు. తాను వైయస్సార్‌సీపీ లో కొనసాగుతున్నానని, గ్రామంలో బలంగా ఉన్న వైయస్సార్‌సీపీని బలహీన పరచాలన్న దురుద్ధేశంతో అధికార పార్టీ ఇటు వంటి చర్యలు చేస్తుందన్నారు. ఇదేవిధంగా ఎంతో మందికి తమకి తెలియ కుండానే పార్టీ సభ్యుత్వ కార్డులు ఇళ్ళకు రావటంతో వారు ఆయోమయానికి గురవుతున్నారన్నారు.
 
Back to Top