పోర్టు కోసం పాద‌యాత్ర‌

నెల్లూరు : దుగ్గరాజపట్నం పోర్ట్ తో పాటు రామాయపట్నం పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్ట్ తో పాటు షిప్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. 

కావలి నుంచి రామాయపట్నం వరకు సాగిన ఈ పాదయాత్రలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి,  రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Back to Top