ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఉద్య‌మం

- యూనివ‌ర్సిటీ బంద్‌కు వైయ‌స్ఆర్ సీపీ విద్యార్ధి విభాగం పిలుపు
 విశాఖ‌:  ఏపీకి ప్రత్యేకహోదా సాధించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం  ఉద్యమ బాట ప‌ట్టింది. రేప‌టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 1న విశ్వ విద్యాల‌యం బంద్‌కు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం నాయ‌కులు కాంతారావు, చంద్ర‌శేఖ‌ర్‌, మోహ‌న్ పిలుపునిచ్చారు. 2వ తేదీన వంటా వార్పు కార్య‌క్ర‌మం, 3వ తేదీన మెస్‌ల బ‌హిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ నాయకులు  హోదా విషయంలో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులిస్తే చాలని ప్రత్యేక హోదాతో పనేముందంటూ బాహాటంగా సీఎం వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక్క‌రే ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఉద్య‌మిస్తున్నార‌ని తెలిపారు. హోదా సాధించే వర‌కు వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పోరాటాల్లో పాల్గొని మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని విద్యార్థి నాయ‌కులు తెలిపారు. విశాఖ‌లో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని వారు పిలుపునిచ్చారు.
Back to Top