సాక్షి ఛానెల్ నిలిపివేత మీద ఆగ్రహం

  • చంద్రబాబు తీరుమీద ఆగ్రహం
  • నిరసన తెలుపుతున్న ప్రజాసంఘాలు, జర్నలిస్టు యూనియన్ లు
  • ప్రభుత్వ తీరుని ఖండించిన వైయస్సార్సీపీ నాయకులు
  •  హైదరాబాద్: ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను చూపించడాన్ని సహించలేక
    తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి ఛానెల్‌ను నిలిపివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం
    అవుతోంది. అనేక చోట్ల ప్రతిపక్ష వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
    ధర్నా చేశారు. పలుచోట్ల ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. జర్నలిస్టు సంఘాలు ఆయా
    ప్రాంతాల్లో నిరసన తెలిపాయి.


    విజయనగరంలో వైయస్సార్సీపీ నాయకత్వంలో పెద్ద ఎత్తన ధర్నా, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు రాజకీయాల్లో దురుద్దేశాలు పెట్టుకొని కక్షసాధింపు చర్యగానే
    ప్రసారాలను నిలిపివేశారని మండిపడ్డారు. ముద్రగడ దీక్ష విరమిస్తే ఛానల్‌ ప్రసారాలను
    కొనసాగిస్తామని రాష్ట్ర హోంమంత్రి చిన్నరాజప్ప చెప్పడం దారుణమన్నారు. కాపు జాతి
    కోసం ముద్రగడ దీక్ష చేస్తున్నారని, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
    డిమాండ్‌లను పరిష్కరించుకోవాలి గానీ దీక్షకు ఛానల్‌కు సంబంధాలు పెట్టొద్దని
    డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో
    పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టనున్నట్లు హెచ్చరించారు. 


    విశాఖపట్నంలో
    అనేక చోట్ల ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి. గాజువాక లో అఖిలపక్ష పార్టీల నాయకత్వంలో
    ఆందోళనలు జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి.
    గుంటూరు జిల్లా వినుకొండ లో జర్నలిస్టు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రకాశం
    జిల్లా లో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు యూనియన్ లు నిరసన తెలిపాయి.


    నెల్లూరు
    జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి.
    కావలిలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఆత్మకూరు లో ఆందోళన జరిగింది.
    ఉదయగిరి లో నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో
    అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ ఆందోళన
    చేపట్టారు. కర్నూలు జిల్లా లో జర్నలిస్టు సంఘాలు ధర్నా నిర్వహించాయ


     

     

     

     

Back to Top