ఏ గ్రూప్ రక్తం కావాలన్నా సంప్రతించండి

హైదరాబాద్ 22 ఫిబ్రవరి 2013:

హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌‌లో సంభవించిన బాంబు పేలుళ్ల బాధితులకు నేనున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈ పేలుళ్ళలో గాయపడినవారికి సహాయ సహకారాలందించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ ప్రకటించారు. ఏ గ్రూపు రక్తం  కావాలన్నా ఫోను చేయవచ్చని ఆయన తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ నెంబర్లు 98490 32888, 96522 78978 లకు ఫోను చేస్తే అవసరమైన మేరకు సాయం చేస్తామని వెల్లడించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైద్య విభాగం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటుందని తెలిపారు.

Back to Top