దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే

కె.గంగవరం : ఇటీవల అధికార పార్టీ మంత్రి సీహెచ్‌ ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు బహిరంగంగా దళితులకు క్షమాపణ చెప్పాల్సిందేనని వైయస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పెట్టా శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మండలకేంద్రమైన కె.గంగవరం బస్టేండ్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహానికి పెట్టా శ్రీనివాస్‌ పార్టీ శ్రేణులతో కలసి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులను గౌరవించాల్సిన మంత్రి అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు. కేవలం అధికారం చేతిలో ఉందని నోటికివచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఉరుకోమని హెచ్చరించారు. గౌరవ ప్రదమైన పదవిలో ఉండి దళితల సమస్యలపై పోరాడవల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దళితుల హక్కులను కాలరాయడమేనన్నారు. వెంటనే మంత్రి ఆదినారాయన రెడ్డి అంబేద్కర్‌ విగ్రహం కాళ్లు పట్టుకుని దళితులందరికి భహిరంగంగా క్షమాపన చెప్పాలని లేని పక్షంలో దళితులందరంగా ఏకమై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ బత్తుల అప్పారావు, సర్పంచ్‌లు పండు గోవిందరాజు, జనిపెల్ల శ్రీనివాస్‌(సాయి), మండల పరిషత్‌ కోఆప్సన్‌ సభ్యలు దాకి ఏలియా, కూర్మా రాజు, కర్ణ, మార్కెట్‌ శ్రీను, ఇనకోటి కొండ, బాబురావు, తోకల శ్రీను, కాశీ లెనిన్‌బాబు, దళిత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top