ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

  • దళితులను, రాజ్యాంగ విలువలను కించపర్చిన ఆదినారాయణరెడ్డి
  • మంత్రిని వెంటనే కేబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలి
  • లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం అవుతాయి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు
హైదరాబాద్‌: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆదినారాయణరెడ్డిని రాష్ట్రంలో తిరగనివ్వొద్దని దళిత సంఘాలకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు అనుగూనంగా పరిపాలన జరుగుతున్న ఈ దేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కేబినెట్‌ మంత్రుల వరకు దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దళితులు చేతగానివాళ్లు, తెలివితక్కువ వాళ్లు, శుభ్రంగా ఉండరని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డిపై రాజ్యాంగపరమైన కేసులు పెట్టాలన్నారు. 

కండ్ల కావరం ఎక్కి మాట్లాడుతున్నాడు
ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? సాక్షాత్తు చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని మాట్లాడరని, చంద్రబాబు వెంటే మంత్రులు కూడా దళితులపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు చేతగాని వాళ్లు అని మాట్లాడిన ఆదినారాయణరెడ్డికి కళ్ల కావరం ఎక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. విలువలు కాపాడాల్సిన బాధ్యతాయుతమైన మంత్రి ఈ రోజున దళితుల గురించి చిన్నచూపుగా మాట్లాడి మనోభావాలను దెబ్బతీశాడన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రోజన మంత్రి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పోలీసు వ్యవస్థ కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఆదినారాయణరెడ్డిపై సుమోటోగా కేసు పెట్టి అరెస్టు చేసి రాజ్యాంగ విలువలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. దళితులను కించపరిచిన ఆదినారాయణరెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

Back to Top