దళితులకు మంత్రి క్షమాపణ చెప్పాలి

  • దళితులు టీడీపీకి ఓట్లేసే ప్రసక్తే లేదు
  • మంత్రి ఆదిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం
  • చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు
  • రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తున్నారు?
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య
నంద్యాలః అధికార తెలుగుదేశం దళితులను కించపరుస్తోందని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దళితులపై మంత్రి ఆది నారాయరెడ్డి చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలు తమను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నిర్ణయించామని,  దేనికీ వెనుకాడేది లేదని ఐజయ్య అన్నారు. ఆది నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీలోని దళితులంతా మనోవేధనతో ఉన్నారని అన్నారు. నంద్యాలలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ తో కలిసి ఐజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు, దళితులు రిజర్వేషన్లు ఇచ్చినా ఎదగరు, శుభ్రంగా అండరు, గిరుజనులకు తెలివుండందంటూ ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతిలో అధికారం పెట్టుకొని దళితులను అభివృద్ధి చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. దళితులపై టీడీపీకున్న వివక్ష మరోసారి బట్టబయలైందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని , రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాడని ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తక్షణమే మంత్రి ఆదినారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఐజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో దళిత భూములను ఆక్రమించి వాళ్లను తరిమికొట్టి లూటీ చేస్తూ...దళితులు ఎదగడం లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు.  గరగపర్రులో దళితులను శిరోఖండనం చేసి బహిష్కరించింది టీడీపీ కాదా..? బాబు ఆధిపత్యంలో జరుగుతున్న అన్యాయాలను సహించేది లేదన్నారు. దళితులు టీడీపీకి ఓట్లేసే ప్రసక్తే లేదని అన్నారు. అవినీతి సొమ్ముతో నంద్యాలలో బాబు ఓటుకు రూ. 5వేలు ఇచ్చి కొనాలని చూస్తున్నాడని ఐజయ్య అన్నారు. ఆర్థిక, అండబలంతో ఎమ్మెల్యేలను, ఓటర్లను అందరినీ కొనాలని చూస్తున్నాడని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని బాబుపై ధ్వజమెత్తారు.  దళితులపై బాబు సర్కార్ చేస్తున్న దుర్మార్గపు చర్యల్ని  ఎస్సీ కమిషన్, కార్పొరేషన్ చైర్మన్ లు  కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్ లుఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.  దళితులపై టీడీపీ దౌర్జన్యాలను ఖండించి కులాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  మంత్రులు దళితులపై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హెచ్చరించారు. 

Back to Top