అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు

సిరిసిల్ల(కరీంనగర్), 19 మే 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాలన మాదిరిగా రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విమర్శించారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఇక్కడికి  రాజకీయం చేయడానికి రాలేదని చెప్పారు. నేతన్నలకు ధైర్యం చెప్పడానికి వచ్చానన్నారు. దివంగత  మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఐదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరికీ మేలు జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహానేత పాలనలో ఆహార, ఉద్యోగ, పెన్షన్, ఆవాస భద్రత ఉండేదని వివరించారు. ఇప్పుడు ఆ మేలు ఒకగూరడం లేదని  ఆవేదన వ్యక్తంచేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తానేమీ తక్కువ తినలేదంటూ నాలుగుసార్లు పెంచిందన్నారు. మహానేత పాలనలో ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీలు, పన్నులు పెంచని విషయాన్ని శ్రీమతి విజయమ్మ జ్ఞాపకం చేశారు. ఆయన ప్రత్యేక పథకాలతో నేతన్నలను ఆదుకున్నారని చెప్పారు. సిరిసిల్లలో దివంగత మహానేత నెలకొల్పిన చేనేత టెక్సుటైల్ పార్కు ఇప్పుడు నిరుపయోగంగా మారిందని విచారం వ్యక్తంచేశారు. ప్రతి మనిషి గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి వైయస్ఆర్ అని చెప్పారు. ఎవరు ఇది కావాలని అడగక ముందే నెరవేర్చారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని, మంచిరోజులు వస్తాయని చేనేత కార్మికులకు ధైర్యం చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సువర్ణయుగాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారని భరోసా ఇచ్చారు.

చే'నేతన్న'లూ ధైర్యంగా ఉండండి
రాష్ట్రంలో చేనేత కార్మికులు ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు. 312 కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాలని బడ్జెట్లో మహానేత ప్రతిపాదించారనీ, దానిని కిరణ్ ప్రభుత్వం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. చేనేత కార్మికుల సమస్యలను శాసనభలో మాట్లాడతానని చెప్పారు.
అంతకుముందు ఆమె కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు కట్ల నారాయణ, బాజంగి ప్రభాకర్ కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబాలను ఓదార్చారు. విద్యుత్తు బిల్లు 59 వేల రూపాయలు రావడంతో ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధైర్య పడవద్దని ఆయన కుటుంబీలకు శ్రీమతి విజయమ్మ ధైర్యం చెప్పారు.

ఎఫ్ఎస్ఏ చార్జీలపై అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. వైయస్ అయిదేళ్ళ పాలనలో ప్రతి ఒక్కరికీ మేలు ఒనగూరింది. ప్రతి మనిషి గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి  వైయస్ఆర్ అని ఆమె పేర్కొన్నారు. వైయస్ సువర్ణయుగాన్ని జగన్ బాబు తెస్తారని భరోసా ఇచ్చారు.

తొలుత ఉయదం ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరి సిరిసిల్ల చేరుకున్నారు. అప్పుల బాధతో మూడు రోజుల క్రికతం ఆత్మహత్య చేసుకున్న కట్ల నారాయణ కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించారు. నారాయణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని విజయమ్మ భరోసానిచ్చారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన బాజంగి ప్రభాకర్ కుటుంబాన్ని కూడా శ్రీమతి విజయమ్మ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు.  అనంతరం ఆమె హైదరాబాద్ నగరానికి తిరుగుపయనమయ్యారు.

Back to Top