అధర్మం చేసిన వారే ధర్మ యుద్దం చేయటమా?

కౌలు రైతుల గుర్తింపును రద్దు చేస్తున్నారు
పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు.
ప్రత్యేక హోదాను ఖూనీ చేశారు
ఇసుక నుంచి డబ్బులు రాబట్టుకోవడమే పని
నాలుగేళ్లుగా ఇసుకాసురులు, మట్టికాసురులు విజృంభిస్తున్నారు 

ప్రజా సంకల్పయాత్ర పామర్రు కు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. కిక్కిరిసిన జనసందోహం మధ్యన ఆయన మాట్లాడిన ప్రతి మాటకు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మండుతున్న ఎండను కూడా ఖాతరు చేయకుండా సభకు తరలివచ్చారు.  జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ...

పామర్రు నియోజ కవర్గంలో అడుగుపెడుతూనే చెప్పిన విషయాలుఏమిటో తెలుసా? మా ప్రాంతంలో ఫ్లోరోసిస్ కూడా ఉందన్నా, తాగడానికి నీళ్లు కూాడా అందని  ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్పుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో  నీళ్ల గురించి ఆలోచించాల్సింది పోయి, ఇసుక నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలన్న దానితోనే పనిచేస్తున్నారు.  గతంలో  నరకాసురుడు, బకాసురుడు, రావణాసురుడి ఇలాంటి పేర్లు విన్నామన్నా, ఈ నాలుగేళ్లు దా కొత్తగా ఇసుకాసురులు, మట్టికాసురులన చూస్తున్నామన్నా రైతులు ఆవేదన చెందుతున్నారు. 
ఇసుక రీచ్ ల నుంచి  వేల లారీల్లో , లక్షల టన్నులు తీసుకుని పోతున్నా,సమీపంలోనే ఉంటున్న చంద్రబాబుకు కనిపంచదా అని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు, ఇలాంటి అక్రమాలకు  చంద్రబాబే డాన్ కదా అన్న విషయం తమకు తెలుసునంటూ , ఇలాంటి వారి హయాంలో సజావైన పాలన ఎలా సాగుతుందంటూ రైతన్నలు బాధపడుతున్నారు.

పమిడిముక్కల మండంలోని కొంతమంది  ఎస్సీలు నాదగ్గరకు వచ్చారు. ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నారు. ఆ రోజు నాన్నగారి  హయాంలో ఇళ్లు కట్టించారని , అక్కడి పరిస్థితులను బాగు చేయించాల్సింది పోయి పూర్తిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ వాపోయారన్నారు. కాలనీలో  మురుగు కాలువలు, కరెంటు, రోడ్లు సక్రమంగా లేకున్నా చంద్రబాబు సర్కారు ఎస్సీ, ఎస్టీలను పక్కకు బెట్టిందన్నా ఆవేదనతో చెప్పారు. నాలుగేళ్ల బాబు కాలంలో ప్రభుత్వంలో మాకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నా, వారి ఆవేదన చూస్తుంటే, పేదలు ఇంతలా బాధలు పడుతుంటే చేష్టలుడిగి చూస్తున్న ఈ ప్రభుత్వానికి మనసుందా అని సూటిగా అడిగారు. 

చెరుకు, మినుము, వరి పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు, కౌలు రైతులు నానాపాట్లు పడుతున్నారన్నారు. కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దివంగత మహానేత వైయస్ ఆర్ హయాంలో మంజూరు చేసిన కౌలు గుర్తింపు కార్డులను పూర్తిగా రద్దు చేసే స్థితులు తీసుకుని వస్తున్నారన్నారు. రైతన్నలు పడుతున్న కష్టాలు చూస్తే కంట నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కన్నీళ్లు పెట్టిన రైతులెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. 
రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడానికి కారణం, తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడే పెద్ద దళారీగా తయారవ్వడమే అని ధ్వజమెత్తారు. తన హెరిటేజ్ సంస్థల వ్యాపరం కోసం రైతుల దగ్గర నుంచి వీలైనంత వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని రెండు మూడింతల అధిక రేట్లకు అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అదే విధంగా పాడి పరిశ్రమను కూడా దగా చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా గతంలో ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం, విద్యుత్ ఛార్జీల తగ్గింపు అంశాలపై ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎలా తుంగలోకి తొక్కుతున్నారో వివరించారు. 

పెట్రోలు, డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజల నడ్డి  విరుస్తున్నచంద్రబాబు పాలనను ఎండగట్టారు. 
 రైతన్నలకు రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో ఉన్న బంగారు నగలు ఇంటికి తిరిగి రావాలంటే, జాబు రావాలంటే , డ్వాక్రా సంఘాల రుణమాఫీ కావాలంటే బాబు రావాలంటూ నినాదాలు ఇచ్చి అందరిని మోసం చేసిన తీరును ఎండగట్టారు. నాలుగేళ్లుగా విశాఖపట్టణంలో మీటింగ్ లు పెడుతూ 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకుంటున్నారనీ అవి ఎవరికైనా కనిపిస్తున్నాయా అని సూటిగా అడిగారు.   జాబు రావాలంటే బాబు పోవాలన్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయన్నారు. 

 ఇటువంటి పెద్దమనిషి మోసాలు చేసే మనిషి వ్యక్తి ఈ మద్య కాలంలోనే ఒక మాట అన్నారు. తన మీద కేసులు పెడితే, రాష్ట్ర ప్రజలంతా ఒక వలయంగా ఏర్పడాలట,తనను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే అట, ఇంతటి అవినీతి పరుడి  నోట్లో నుంచి వచ్చిన డైలాగ్ అది. ప్రత్యే క హోదాను ఖూనీ చేసిన అన్యాయమైన పెద్దమనిషి ఈ విధంగా మాట్లడాన్ని ఏమనాలి?

ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే, అది వచ్చి ఉండేది, తద్వారా పెట్టుబడులు  వచ్చి పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటళ్లు, ఫ్యాక్టరీలు అనేక వచ్చి ఉద్యోగాల వెల్లువ వచ్చి ఉండేదని కానీ ఆయన దారుణానికి ఒడిగట్టారు.
మోసం చేయడంలో ఒక అడుగు ముందుకు వేసి, ప్రత్యేక హోదాకు వెన్ను పోటు పొడిచి తరువాత తానే బుకాయిస్తున్నారన్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు తిరుపతిలో తాను దీక్ష చేస్తాననడం పూర్తిగా హాస్యాస్పదంగా ఉందంటూ ఒక ఉదంతాన్ని వివరించారు. తన స్వార్థం కోసం పదవి కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కూడా కారణమై, ఆయన ఫోటోకు దండలు వేస్తూ ఎన్నికలకు పోయినట్లుగానే హోదా విషయంలోని చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చురకలు వేశారు. ఇది గాంధీ గారిని కాల్చిన గాడ్సే, గాంధీజిని చంపినందుకు నిరసన దీక్ష చేసినట్లుగానే ఉందన్నారు. 

తిరుపతిలో రేపు ధర్మదీక్ష చేస్తారంట ఆయనకు సూటిగా ఏడు  ప్రశ్నలు సంధిస్తూ  వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1 ప్రశ్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కంటే ముందుగానే 2014 మార్చిలో అప్పటి యుపిఎ ప్రభుత్వం మంత్రివర్గంలో తీర్మానం చేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశిస్తే, ఆ ఏడాది డిసెంబరు వరకు ప్రణాళిక సంఘం అమలులో ఉన్నప్పటికీ చంద్రబాబు ఒక్కసారి కూడా ప్లానింగ్ కమిషన్ ను ఎందుకు కలవలేదు, కనీసం లేఖ కూడా ఎందుకు రాయలేదు ? ఈ ఏడు నెలల కాలం గాడిదలు కాశారా ? ఇది మోసం కాదా?

2. ప్రశ్న  2016 సెప్టెంబరు 8  వతేదీన హోదాకు బదులు ఒక అబద్దపు ప్యాకేజి ఇస్తున్నట్లు చంద్రబాబుకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలను పక్కన పెట్టుకుని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దాదాపు అదే స్టేట్ మెంట్ తో ఇటీవలనే అరుణ్ జైట్లీగారు మళ్లీ ప్రకటిస్తే , ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రం నుంచి తప్పుకున్నారు.  
2016 లో  ప్రకటన ఇచ్చిన రోజు  అర్ధరాత్రి అని కూడా చూడకుండా దానిని ఆహ్వానించారు, బ్రహ్మాండంగా ఉందంటూ చప్పట్లు కొట్టారు. ఢిల్లీ వెళ్లి శాలువలు కప్పి అసెంబ్లీలోనూ  తీర్మానించారు.  అంతే కాకుండా  2017 జనవరిలో కేంద్రం మన రాష్ట్రానికి చేసినట్లుగా మరే రాష్ట్రానికి చేయలేదంటూ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల ఏం బాగుపడ్డాయి అని, కోడలు మగ పిల్లాడిని కంటే, అత్త వద్దంటుందా  అని అడిగారు. ఇది మోసం కాదా?

3 వ ప్రశ్న ప్రత్యేక హోదా మనకు అవసరం లేదనే తీరులో ప్రచారం చేసుకుంటూ  విశాఖలో మీటింగ్లులు పెడుతూ  20 లక్షల పెట్టుబడులు  40 లక్షల  ఉద్యోగాలు వచ్చాయంటూ చెప్పుకుంటే, ప్రత్యేక హోదా ఇచ్చేవారు ఇస్తారా. ఇది ద్రోహం కాదా?
4 ప్రశ్న  ప్రత్యేక హోదా కోసం  ఏ పోరాటం చేసినా,  బంద్ కాల్ చేసినా , ఆందోళనలు చేసినా, దగ్గరుండీ నీరుగార్చింది నువ్వు కాదా. బంద్ నిర్వీర్యం చేసేలా బలవంతంగా బస్సులు నడిపించింది నీవు కాదా. నేను 8 రోజులు నిరాహార దీక్ష చేస్తే మోడీ గారు వస్తున్నారని, టెంట్ ను పోలీసులతో ఎందుకు ఎత్తివేయించారు విద్యార్ధులతో చైతన్యం తేవడానికి యువభేరి కార్యక్రమాలకు వెళితే పిడి యాక్టు కేసులు పెడతానని హెచ్చరించిన చరిత్ర నీది కాదా?

5 ప్రశ్న  మేము  అవిశ్వాసం పెట్టకపోయి ఉంటే, పార్లమెంటులో నువ్వు అవిశ్వాసం పెట్టేవాడివా ?
మార్చి 15 గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ,  సంఖ్యాబలం ఉంటేనే మద్ధతు ఇస్తామని ప్రకటించి, శుక్రవారం పొద్దునే యుటర్నుతీసుకున్నావు.  వైయస్ ఆర్ సీపీ ఎంపిలు ప్రతి పార్టీని కలిసి మద్దతు ఇవ్వాలంటూ లేఖలు  అందిస్తే, మద్ధతిస్తున్నారని తెలిసి, తానే అవిశ్వాసం పెడుతున్నట్లుగా, తనకు మద్ధతు పలుకుతున్నాయన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. అసలు ఆయన ఏ జాతీయ పార్టీతో మాట్లాడారు? ఇవన్నీ మోసాలు కావా? ఊసర వెళ్లి కంటే వేగంగా రంగులు మార్చే గుణం నీది కాదా?
6 ప్రశ్న అఖిల పక్షం  అనే డ్రామాలు ఆడుతూ కార్యాచరణ నిరసనలు, ఆందోళనలు, చేయకూడదట, విద్యార్ధులు ఉద్యమంలో రాకూడదట, కేవలం నల్లబ్యాడ్చీలు ధిరించాలట ఇలా చేస్తే ప్రత్యేక హోదా ఇస్తారా బాబూ?
7 ప్రశ్న సంధిస్తూ జగన్ ఒక కథను చెప్పారు. వైయస్ ఆర్ సీపీ ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేసి,ఆమరణ దీక్షకు కూర్చుంటే, వారితో టిడిపి ఎంపిలు కలవకుండా, మొత్తం 25 మంది ఒకేసారి దీక్షకు కూర్చుని కేంద్రంపై వత్తిడి పెంచే సమయంలో కలిసిరాకుండా మొరాయించడంతో, ప్రత్యేక హోదా మరోసారి వెనక్కు పోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 
ఇటువంటి మోసాలు, అబద్దాలు చూస్తుంటే, ప్రత్యేక హోదాకు అన్యాయం చేసిన పరిస్థితులు చూస్తే చాలా బాధవేస్తోందని అన్నారు.
చంద్రబాబు ఇటీవల ఒక రోజు దీక్ష చేశారు. అది 420 దీక్ష , అందుకోసం ప్రభుత్వం నుంచి 30 కోట్లు ఖర్చు చేశారు. ఆయనో చంద్రబాబా ఆయన కాలక్కు మొక్కడానికి పెయిడ్ ఆర్టిస్టులు ఇలా కొనసాగింది ఇది ధర్మయుద్దమట. 
ఇక్కడా మోసం స్పష్టంగా కనిపిస్తోంది. రేపు తిరుపతిలో చేయబోయే దీక్ష గురించి మాట్లాడితే పైన టిటిడి బోర్డులో మహారాష్ట్రకు చెందిన బిజెపి నాయకుడి భార్య సభ్యులుగా నియమిస్తారు, కింద ఏమో వారికి ధర్మయుద్దం చేస్తారట ఇంతకంటే భ్రష్టుపట్టిన రాజకీయం ఏమైనా ఉంటుందా అని అడిగారు.
అటు తరువాత ఆయన నవరత్నాలు గురించి వివరించారు. 

Back to Top