వైయస్‌ జగన్‌ మాటిస్తే.. తప్పేవారు కాదు


– నటుడు పృథ్వీ
తూర్పు గోదావరి: కొన్ని వందల మందికి మేలు జరుగుతుందని వైయస్‌ జగన్‌ మాటిస్తే..ఆ మాటను తప్పేవారు కాదని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై నేరుగా మా లీడర్‌ వైయస్‌ జగన్‌ను అడిగానని సినీ నటుడు పృథ్వీ పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్లపై వస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించానని ఆయన చెప్పారు. తన మాటలు వక్రీకరించారని వైనయస్‌ జగన్‌ పేర్కొన్నట్లు పృథ్వీ తెలిపారు.  కాపుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని వైయస్‌ జగన్‌ తనతో అన్నట్లు వివరించారు. బీసీలకు అన్యాయం జరగకుండా, వారి హక్కులకు భంగం రాకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా చిత్తశుద్ధితో చేస్తామన్నారు. వైయస్‌ జగన్‌ మాటలు విన్నాక..ఎన్ని గాలి మాటలు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థమైందన్నారు. నా మాటలు తప్పని ఎవరైనా అంటే ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాలు విసిరారు. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తాననడం చారిత్రాత్మకమన్నారు.
 
Back to Top