వైయస్‌ఆర్‌ సిపి సమావేశానికి కార్యకర్తలు తరలిరండి

జి.సిగడాం: లావేరు మండలం సుభద్రపురం సెంట్రల్ లో వచ్చేనెల 1 వతేది మద్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌సిపి నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్నికి మండల, గ్రామస్థాయి కార్యకర్తలంతా విధిగా హజరుకావాలని మండల పార్టీ అధ్యక్షులు మీసాల వెంకట రమణ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె కిరణ్‌ కూమార్, మాజీ ఎంఎల్‌ఎ మీసాల నీలకంఠంనాయుడు లతోపాటు జిల్లా స్థాయి నాయుకులు హజరుఅవ్వతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని, ఎన్నికల ముందు ప్రజలకు లేని పొని హమీలు ఇచ్చి గద్దెక్కిన చంద్రబాబు నాయుడుకు ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు. డ్వాక్రా ,రైతులకు రుణాలు మాఫీ చేయడంలో అలసత్వం వ్యహిస్తున్నారు. చంద్రబాబునాయుడు మటలు నమ్మి మహిళా సంఘాలు పూర్తిగా మోస పొయారన్నారు.

Back to Top